రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్‌ నుంచి స్పెషల్ ట్రైన్స్, పూర్తి వివరాలివే

byసూర్య | Fri, May 10, 2024, 09:04 PM

పార్లమెంట్ ఎన్నికల వేళ ట్రైన్ ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్లేవారి కోసం సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్స్ నడిపేందుకు రెడీ అయింది. సికింద్రాబాద్‌ నుంచి ఒడిశాలోని ఖుర్దారోడ్‌ స్టేషన్‌కు ఈ ట్రైన్లు నడపవనున్నాయి. రెండు రోజులపాటు రెండు స్పెషల్ ట్రైన్లు నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. ఈ నెల 10, 11 తేదీల్లో సాయంత్రం 4.30కి రెండు ట్రైన్లు ( ట్రైన్ నెంబర్ 07129, 07131) సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరుతాయని రైల్వే అధికారులు తెలిపారు.


ఈ ట్రైన్లు తెలంగాణలోని నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, ఏపీలోని పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, విజయనగరం, కొత్తవలస, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్‌, పలాస, బ్రహ్మపుర్‌ స్టేషన్ల మీదుగా ఖుర్దారోడ్‌ చేరుకుంటాయి. 13న ఏపీ, ఒడిశాల్లో పోలింగ్‌ ఉన్నందున రైల్వేశాఖ ట్రైన్లును ప్రకటించింది. 11, 12 తేదీల్లో ఖుర్దారోడ్‌ స్టేషన్‌ నుంచి రెండు ట్రైన్లు ( ట్రైన్ నెంబర్లు 07130, 07132) రాత్రి 10 గంటలకు తిరుగు ప్రయాణమై సికింద్రాబాద్‌ స్టేషన్‌కు చేరుకుంటాయని చెప్పారు.


ఇక సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ మధ్య ఈ నెల 10న స్పైషల్ ట్రైన్( ట్రైన్ నెబంర్ 07133) నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. శుక్రవారం రాత్రి 7.40 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరే ఈ ట్రైన్ నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, కైకలూరు, ఆకివీడు, భీమవరం, పాలకొల్లు మీదుగా నర్సాపూర్‌ స్టేషన్ చేరుతుంది. 11న ఇదే రూట్‌లో ట్రైన్ తిరుగు ప్రయాణం అవుతుంది.


Latest News
 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం అందరికీ అర్థమైంది,,,మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి Mon, May 20, 2024, 10:00 PM
అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలి,,మాజీ మంత్రి హరీశ్ రావు Mon, May 20, 2024, 09:53 PM
తెలంగాణలో మళ్లీ వానలు.. ఈ జిల్లాల్లోనే, వాతావరణశాఖ హెచ్చరికలు Mon, May 20, 2024, 09:01 PM
తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్.. ఈ రూట్‌లోనే, త్వరలోనే పనులు ప్రారంభం Mon, May 20, 2024, 08:58 PM
కుమార్తెను చంపిన తల్లిదండ్రులు.. తల్లికి దూరమైన 13 నెలల పసికందు Mon, May 20, 2024, 08:54 PM