కవితే సూత్రధారి, పాత్రధారి.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ ఛార్జిషీట్

byసూర్య | Fri, May 10, 2024, 10:33 PM

ఢిల్లీ లిక్కర్ స్కాంలో తాజాగా మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయి జ్యుడీషియల్ ఖైదీగా తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా మరో ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఈ కేసులో కవితే ప్రధాన నిందితురాలంటూ ఈడీ అధికారులు ఛార్జిషీట్‌‌లో పేర్కొన్నారు. లిక్కర్ కేసులో కవిత కీలక సూత్రధారి, పాత్రధారి అని న్యాయస్థానానికి ఈడీ తెలిపింది. మరోవైపు.. కవితతో పాటు మరో నలుగురు నిందితుల పాత్రపై కూడా ఈడీ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది.


ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, విచారణలో భాగంగా సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ దాఖలు చేస్తున్నట్లు ఈడీ అధికారులు న్యాయస్థానానికి తెలిపారు. అదేవిధంగా కవిత, ఛన్‌ప్రీత్‌ సింగ్‌, దామోదర్‌ శర్మ, ప్రిన్స్‌ కుమార్‌, అర్వింద్‌‌ సింగ్‌ పాత్రపై ఈడీ సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో భాగంగా కవిత ప్రస్తుతం ఈడీ, సీబీఐ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. కాగా.. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్న కవిత.. తనపై నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఈరోజు జరగాల్సిన విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది. ఈ నెల 24వ తేదీన విచారణ చేయనున్నట్టు న్యాయస్థానం తెలిపింది. మరోవైపు.. కవితకు బెయిల్ ఇచ్చేందుకు ఇప్పటికే రౌస్ ఎవెన్యూ కోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే.


బీఆర్ఎస్ పార్టీలో కవిత స్టార్ క్యాంపెయినర్ అని.. మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్-45 ప్రకారం బెయిల్ పొందే అర్హత ఆమెకు ఉందని బెయిల్ పొందే అర్హత ఆమెకు ఉందని ఆమె తరపు న్యాయవాదులు వాదించినప్పటికీ.. ఈ కేసులో కవితే ప్రధాన నిందితురాలని, ఆమెకు బెయిల్ వస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ వాదిస్తూ వస్తోంది. కాగా.. ఈమేరకు ఛార్జిషీట్ కూడా దాఖలు చేసింది. కాగా.. ఈ కేసులో 100 కోట్ల ముడుపులు చేతులు మారాయని.. అందులో కీలక సూత్రధారి, పాత్రధారి కవితేనంటూ ఈడీ, సీబీఐ అధికారులు అభియోగం మోపుతున్న విషయం తెలిసిందే.


Latest News
 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం అందరికీ అర్థమైంది,,,మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి Mon, May 20, 2024, 10:00 PM
అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలి,,మాజీ మంత్రి హరీశ్ రావు Mon, May 20, 2024, 09:53 PM
తెలంగాణలో మళ్లీ వానలు.. ఈ జిల్లాల్లోనే, వాతావరణశాఖ హెచ్చరికలు Mon, May 20, 2024, 09:01 PM
తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్.. ఈ రూట్‌లోనే, త్వరలోనే పనులు ప్రారంభం Mon, May 20, 2024, 08:58 PM
కుమార్తెను చంపిన తల్లిదండ్రులు.. తల్లికి దూరమైన 13 నెలల పసికందు Mon, May 20, 2024, 08:54 PM