తెలంగాణలో వర్షాలు.. వాతావరణశాఖ కీలక అప్డేట్

byసూర్య | Sun, Apr 21, 2024, 09:06 PM

గత నెలన్నర రోజులుగా రాష్ట్రంలో భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సూర్యుడు నిప్పులు కురిపిస్తుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే తీవ్రమైన ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ.. గత రెండు రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో శనివారం వర్షం దంచికొట్టింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవటంతో నగర ప్రజలు కూల్ వెదర్‌ను ఎంజాయ్ చేసారు. అయితే పలు జిల్లాల్లో అకాల వర్షం కారణంగా తీవ్ర పంటనష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంట నేలరాలింది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో పంట నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది.


ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాలపై వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఇవాళ కూడా రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా దక్షిణ, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. వరంగల్, హన్మకొండ, జనగాం, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వర్షాలు అవకాశం ఉందన్నారు. ఇప్పుడు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా.. సాయంత్రానికి వర్షం కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు.


హైదరాబాద్‌లో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నేడు, రేపు వర్షం కురిసే ఛాన్స్ తక్కువగా ఉందన్నారు. ఏప్రిల్ 25 నుంచి మే 5 వరకు రాష్ట్రంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని చెప్పారు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు.


Latest News
 

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు Mon, Sep 23, 2024, 10:19 PM
బీజేపీలోకి వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య..? కాషాయ పార్టీ టార్గెట్ అదే Mon, Sep 23, 2024, 10:18 PM
మీ సేవ కేంద్రాల్లో డేటా క్రాష్.. ఆందోళనలో దరఖాస్తుదారులు Mon, Sep 23, 2024, 10:16 PM
మూడ్రోజుల క్రితమే ఇంటి రిజిస్ట్రేషన్.. అంతలోనే కూల్చేసిన 'హైడ్రా' Mon, Sep 23, 2024, 10:14 PM
ప్రైవేట్‌ హాస్పిటల్‌లో దారుణం.. డబ్బు కట్టలేదని కుట్లు విప్పేశారు Mon, Sep 23, 2024, 10:12 PM