మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. ఆ రోజు వైన్‌ షాపులు బంద్.. సర్కార్ ఆదేశాలు

byసూర్య | Sun, Apr 21, 2024, 09:01 PM

మందుబాబులకు హైదరాబాద్ నగర పోలీసులు బ్యాడ్‌న్యూస్ వినిపించారు. ఎల్లుండి అంటే.. 23వ తేదీన నగరవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు, బార్లు మూసేయాలని అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా నగర వ్యాప్తంగా ఉన్న వైన్ షాపులు, బార్లు మూసేయాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. హనుమాన్ జయంతిని హిందువులు ఎంతో ఘనంగా.. జరుపుకుంటారు. వీధి వీధినా ర్యాలీలు తీస్తూ.. హనుమ నామ జపం చేస్తుంటారు. ఈ క్రమంలో మద్యం దుకాణాలు తెరవకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించి.. ఎవరైనా దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.


హనుమాన్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే సంబంధిత అధికారులు ఆయా ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే మద్యం విక్రయాలను నిలిపివేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. పర్వదినాలు, పండుగ దినాల్లో రాష్ట్రంలో మద్యం షాపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. పర్వదినాలతో పాటు లోక్ సభ ఎన్నికలు కూడా ఉండటంతో ఎలాంటి వివాదాలు, మతపరమైన ఘర్షణలకు తావు ఉండకూడదని పోలీసు శాఖ ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.


Latest News
 

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు Mon, Sep 23, 2024, 10:19 PM
బీజేపీలోకి వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య..? కాషాయ పార్టీ టార్గెట్ అదే Mon, Sep 23, 2024, 10:18 PM
మీ సేవ కేంద్రాల్లో డేటా క్రాష్.. ఆందోళనలో దరఖాస్తుదారులు Mon, Sep 23, 2024, 10:16 PM
మూడ్రోజుల క్రితమే ఇంటి రిజిస్ట్రేషన్.. అంతలోనే కూల్చేసిన 'హైడ్రా' Mon, Sep 23, 2024, 10:14 PM
ప్రైవేట్‌ హాస్పిటల్‌లో దారుణం.. డబ్బు కట్టలేదని కుట్లు విప్పేశారు Mon, Sep 23, 2024, 10:12 PM