రన్నింగ్ కారులో మంటలు.. క్షణాల్లోనే కాలి బూడిద, వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

byసూర్య | Sun, Apr 21, 2024, 08:56 PM

రన్నింగ్ కారులో ఆకస్మాత్తుగా మంటలు చేలరేగాయి. చూస్తుండగానే క్షణాల్లోనే కారు కాలి బూడిదైంది. ఈ ఘటన హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివరాంపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి తన ఇన్నోవా కారులో రహదారిపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఇంజిన్ ముందు భాగం నుంచి ఆకస్మాత్తుగా పొగలు వచ్చాడు. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారును పక్కకు ఆపేశాడు.


కారు దిగేలోగా.. మంటలు చేలరేగాయి. క్షణాల్లోనే కారు మెుత్తం మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. మండుతున్న ఎండలతో షార్ట్ సర్క్యూట్ జరిగి కారు కాలిపోయి ఉండొచ్చని ఫైర్ సిబ్బంది అభిప్రాయపడ్డారు. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోటవంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


వేసవిలో ఈ జాగ్రత్తలు తీసుకోండి


కార్లలో మంటలు చేలరేగడానికి ప్రధాన కారణం.. ఇంజిన్ ఓవర్హీట్. చాలా మంది ఎక్కువసేపు ఆపకుండా కారును డ్రైవ్ చేస్తుంటారు. దాంతో ఇంజిన్ ఒక్కోసారి అధికంగా వేడెక్కి మంటలు చెలరేగే అవకాశం ఉంటుందని ఆటో మొబైల్ నిపుణులు అంటున్నారు. కాబట్టి లాంగ్ జర్నీలు చేసేటప్పుడు మధ్యమధ్యలో విరామాలు తీసుకుంటూ.. ఇంజిన్ కాస్త కూల్ అయ్యే వరకూ వెయిట్ చేసి ఆ తర్వాత డ్రైవింగ్ స్టార్ట్ చేయటం ఉత్తమం.


ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్ కూడా కార్లలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగటానికి ఒక కారణంగా నిపుణులు చెబుతున్నారు. వెహికల్లోని ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్లో ఏదైనా చిన్నపాటి లోపం తలెత్తితే ఆ కారణంగా షార్ట్ సర్క్యూట్ జరిగి వెంటనే మంటలు చెలరేగే ప్రమాదం ఉంటుందంటున్నారు. కాబట్టి వైరింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.


ఫ్యూయల్ లీకేజీ కూడా కారులో మంటలు తలెత్తడానికి ముఖ్య కారణంగా చెబుతున్నారు. వాహనాల్లో ఉపయోగించే పెట్రోల్, డీజిల్ వంటి ఫ్యూయల్స్ అతి త్వరగా మంటలను వ్యాపించే లక్షణాలను కలిగి ఉంటాయన్నారు. కాబట్టి కారులో వీటి లీకేజీ విషయంలో జాగ్రత్తలు తీసకోవాలని చెబుతున్నారు. ఎక్కడైనా చిన్న లీకేజీ కనిపించినా.. వెంటనే ఆ మెకానిక్‌ను సంప్రదించాలని చెబుతున్నారు.


వెహికల్ను సరిగ్గా మెయింటెనెన్స్ చేయకపోయినా కారులో మంటలు చెలరేగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి టైమ్ టూ టైమ్ కారును సర్వీస్ చేయించాలని సూచిస్తున్నారు. కారులో సిగరెట్ తాగేటప్పుడు అది అనుకోకుండా కింద పడినట్లయితే వెహికల్లో మంటలు చెలరేగే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ లేదా అందులో కూర్చునప్పుడు కానీ ధూమపానం చేయకుండా ఉండాలని చెబుతున్నారు.


చాలా మంది కార్లలో నాసిరకం ఎలక్ట్రిల్ యాక్ససరీలను అమర్చుకుంటుంటారు. అది కూడా కొన్ని సార్లు కారులో మంటలు తలెత్తడానికి కారణం కావొచ్చంటున్నారు. కొన్ని సందర్భాల్లో కారు తయారీలో డిజైన్ లోపం కారణంగా కూడా వెహికల్ మంటలు తలెత్తే అవకాశం ఉంటుందంటున్నారు.


Latest News
 

హైడ్రా మరోసారి పంజా Tue, Sep 24, 2024, 10:39 AM
చేపల లోడు లారీ బోల్తా.. లైవ్‌ ఫిష్‌ కోసం ఎగబడిన జనం Tue, Sep 24, 2024, 10:34 AM
బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు Mon, Sep 23, 2024, 10:19 PM
బీజేపీలోకి వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య..? కాషాయ పార్టీ టార్గెట్ అదే Mon, Sep 23, 2024, 10:18 PM
మీ సేవ కేంద్రాల్లో డేటా క్రాష్.. ఆందోళనలో దరఖాస్తుదారులు Mon, Sep 23, 2024, 10:16 PM