ఛీ ఛీ.. ఇంత దారుణమా..!,,,కస్టమర్లు మిగిల్చిన చట్నీని ఇలా వాడుతారా..?

byసూర్య | Wed, Apr 17, 2024, 07:53 PM

హోటల్స్, రెస్టారెంట్లలోకి వెళ్లే చాలా మంది కస్టమర్లు ఫుడ్‌ను వేస్ట్ చేస్తూ ఉంటారు. చట్నీలను సగం వరకు తినేసి వదిలేస్తారు. వాటిని హోటల్ సిబ్బంది డస్ట్‌బిన్‌లో పడేయాలి. కానీ.. హైదరాబాద్‌లో ఓ ప్రముఖ హోటల్ నిర్వహకులు చేసిన పని చూస్తే మాత్రం జన్మలో బయట తినరు. హోటల్, రెస్టారెంట్లలో తినాలంటేనే జంకుతారు. ఎందుకంటే.. వారి తీరు అలా ఉంది మరి.


హైదరాబాద్ బేగంపేట ఏరియాలోని ఓ ప్రముఖ హోటల్‌లో జరిగినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో హోటల్ సిబ్బంది ఓకరు కస్టమర్లు తినగా మిగిలిపోయిన టమోట సాస్, చట్నీలను కిచెన్‌లోకి తీసుకొచ్చాడు. అనంతరం వాటన్నంటిని మరో బౌల్‌లోకి వేశాడు. వాటిని తీసుకెళ్లి జాగ్రత్తగా ఫ్రిడ్జ్‌లో పెట్టాడు. అయితే మిగిలిపోయిన చట్నీలు, సాస్‌లను మరుసటి రోజు ఉపయోగిస్తారనే ఆరోపణలు వస్తున్నాయి. పక్కనే ఉన్న ఓ వ్యక్తి అందుకు సంబంధించిన వీడియో తీయగా.. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. దాదాపు ప్రతి రెస్టారెంట్‌, హోటల్స్‌లోనూ ఇదే జరుగుతుందని కామెంట్లు పెడుతున్నారు. 'వేరే రెస్టారెంట్లలోనూ ఇలాగే చేస్తారేమో..ఇలాంటివి చూస్తే భయమేస్తుంది.' అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. కాగా.. ఇది చాలా కామన్ అని చాలా హోటళ్లో మిగిలిపోయిన నాన్‌వెజ్ వంటకాలు చికెన్ టిక్కా వంటి వాటివి మరుసటి రోజు పుదీనా చట్నీతో కలిపి ఇస్తారని అన్నారు. హైదరాబాద్ హోటల్లో శుభ్రత కోరకువటం దండగ అని మరో నెటిజన్ కామెంట్ పెట్టగా.. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని మరో నెటిజన్ జీహెచ్‌ఎంసీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.


Latest News
 

ముఖ్యమంత్రికి ఓటుతో బుద్ధి చెప్పాలి - ఎమ్మెల్యే పోచారం Tue, Apr 30, 2024, 03:17 PM
ఇంటింటికి ప్రచారం నిర్వహించిన కార్పొరేషన్ చైర్మన్ కాసుల Tue, Apr 30, 2024, 03:17 PM
పదిలో వరసగా 9వసారి నిజాంసాగర్ కెజిబివిలో 100% ఉత్తీర్ణత Tue, Apr 30, 2024, 03:16 PM
చింతకుంటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన శ్రీనివాస్ గార్గే Tue, Apr 30, 2024, 03:16 PM
ఎంపీ అభ్యర్థికి మద్దతుగా యెండల లక్ష్మీనారాయణ ప్రచారం Tue, Apr 30, 2024, 03:07 PM