కాంగ్రెస్‌ పార్టీకి షాక్.. బీజేపీలోకి సిట్టింగ్ ఎంపీ.. ఆ అభ్యర్థిని మార్చేస్తారా

byసూర్య | Wed, Apr 17, 2024, 07:57 PM

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణమాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి రాష్ట్రంలో జంపింగ్ జపాంగుల పర్వం జోరందుకుంది. అయితే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికంటే ముందు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత.. కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆశించగా.. నిరాశే ఎదురైంది. దీంతో.. వెంకటేశ్ నేత ఇప్పుడు బీజేపీలో చేరనున్నట్లు వార్తలు ప్రచారమవుతున్నాయి. కాగా.. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ పేరును బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. అయితే.. సిట్టింగ్ ఎంపీగా ఉన్న వెంకటేష్ నేత బీజేపీలో చేరితే.. ఇప్పటికే ప్రకటించిన గోమాస శ్రీనివాస్‌ను మార్చే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.


అయితే.. ఫిబ్రవరి 6వ తేదీనే సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లిన వెంకటేష్ నేత.. ఆయన సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. కాగా.. బోర్లకుంట వెంకటేశ్‌ నేత 2018లో కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి బాల్క సుమన్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత.. 2019లో పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరిన వెంకటేశ్ నేత.. పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.


Latest News
 

లవర్‌తో ఓయో రూమ్‌కు.. తెల్లారేసరికి విగతజీవిగా యువకుడు, ఏం జరిగింది? Tue, Apr 30, 2024, 09:05 PM
హైదరాబాద్‌లో లేడీ డాన్,,,గుట్టు చప్పుడు కాకుండా గేమింగ్ Tue, Apr 30, 2024, 08:10 PM
అన్నదాతకు గుడ్‌న్యూస్.. రైతుబంధు నిధులపై డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన Tue, Apr 30, 2024, 08:05 PM
5 వేల పింఛన్, 5 లక్షల ఆర్థిక సాయం.. తాగుబోతుల సంక్షేమ సంఘం డిమాండ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే! Tue, Apr 30, 2024, 08:01 PM
వియ్యంకుడి కోసం రంగంలోకి విక్టరీ వెంకటేశ్.. ఆ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం Tue, Apr 30, 2024, 07:41 PM