వియ్యంకుడి కోసం రంగంలోకి విక్టరీ వెంకటేశ్.. ఆ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం

byసూర్య | Tue, Apr 30, 2024, 07:41 PM

మన దేశంలో రాజకీయాలకు, సినీ ఇండస్ట్రీకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఎన్నికల సమయంలో సినీతారలు పార్టీల తరపున ప్రచారం కూడా నిర్వహిస్తారు. గతంలో చాలా మంది ఇలా ఎన్నికల సమయాల్లో పార్టీల తరపున ప్రచారాలు నిర్వహించారు. అప్పట్లో సౌందర్య బీజేపీకి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ టీడీపీకి, ప్రస్తుత ఏపీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తరపున బుల్లితెర నటులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ పార్టీకి సినీ గ్లామర్ అప్లయ్ చేసి ఓట్లు రాబట్టుకునేందుకు ఇలా సెలబ్రెటీలను రంగంలోకి దించుతారు.


ప్రస్తుతం తెలంగాణలోనూ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. వచ్చే నెల 13న పోలింగ్ జరగనుండగా.. అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సినీ గ్లామర్‌ను వాడుకోవాలని చూస్తోంది. ప్రచారానికి టాలీవుడ్ స్టార్ హీరోను రంగంలోకి దింపాలని యోచిస్తోంది. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన గెలుపుకోసం ప్రముఖ టాలీవుడ్ నటుడు వెంకటేష్ ప్రచారానికి సిద్ధమైనట్లు సమాచారం.


హీరో వెంకటేష్‌ కుమార్తె అశ్రితను రఘురాంరెడ్డి పెద్ద కుమారుడు వినాయక్‌ రెడ్డి వివాహం చేసుకున్నారు. దీంతో వియ్యంకుడి గెలుపు కోసం వెంకటేష్ బరిలోకి దిగుతున్నట్లు సమాచారం. మే 7న ఖమ్మంలో వెంకటేష్‌తో ప్రచారం చేసేందుకు షెడ్యూల్ ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అటు కాంగ్రెస్, ‘వెంకీ మామ’ అభిమానుల్లో కోలాహలం మొదలైంది. కేవలం ఖమ్మం పార్లమెంట్ వరకు మాత్రమే వెంకీ ప్రచారం ఉంటుందని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్.. వెంకీ ప్రచారంతో మరింత కలిసి వస్తుందని రఘురాం రెడ్డి వర్గీయులు భావిస్తున్నారు. ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సైతం రఘురాం రెడ్డి వియ్యంకుడు అవుతారు. ఆయన కూడా వియ్యంకుడి గెలుపు కోసం ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వీరి ప్రచారం రఘురాం రెడ్డికి ఎంత వరకు కలిసి వస్తుందో వేచి చూడాలి మరి.


Latest News
 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం అందరికీ అర్థమైంది,,,మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి Mon, May 20, 2024, 10:00 PM
అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలి,,మాజీ మంత్రి హరీశ్ రావు Mon, May 20, 2024, 09:53 PM
తెలంగాణలో మళ్లీ వానలు.. ఈ జిల్లాల్లోనే, వాతావరణశాఖ హెచ్చరికలు Mon, May 20, 2024, 09:01 PM
తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్.. ఈ రూట్‌లోనే, త్వరలోనే పనులు ప్రారంభం Mon, May 20, 2024, 08:58 PM
కుమార్తెను చంపిన తల్లిదండ్రులు.. తల్లికి దూరమైన 13 నెలల పసికందు Mon, May 20, 2024, 08:54 PM