5 వేల పింఛన్, 5 లక్షల ఆర్థిక సాయం.. తాగుబోతుల సంక్షేమ సంఘం డిమాండ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!

byసూర్య | Tue, Apr 30, 2024, 08:01 PM

అసలే దేశంలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీలు సంక్షేమ పథకాల పేరుతో రకరకాల హామీలు ఇస్తున్నారు. వృద్ధులకు పింఛన్లు, రైతులను ఆర్థిక సాయం, రైతు బీమాలాంటి పథకాలు ఇస్తూ.. ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా.. ఇదే సమయంలో తాము ఏమీ తక్కువ కాదని.. అందులోనూ రాష్ట్ర ఖజానా నింపేది తామేనని.. అలాంటి తమకు విస్మరించటమేంటంటూ తాగుబోతులు గళమెత్తారు. తమ డిమాండ్ల చిట్టాను వినిపిస్తున్నారు.


తమ జిల్లాలో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు దొరకట్లేదంటూ తాగుబోతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొట్రంగి తరుణ్.. నిన్న(ఏప్రిల్ 29).. డీఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఖజానాకు నిధులు చేకూర్చేందుకు తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయని తమను దృష్టిలో పెట్టుకుని లైట్ బీర్లు అందుబాటులో ఉంచాలంటూ ఫిర్యాదు చేయటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. కాగా.. ఈరోజు కొట్రంగి తరుణ్ మంచిర్యాలలోని పలు వైన్ షాపుసు, బార్లను సందర్శించి కింగ్ ఫిషర్ లైట్ బీర్లు లభ్యమవుతున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకున్నాడు. పలు ప్రాంతాల్లో లభ్యమవుతున్నది చూసి సంతోషించారు.


ఇన్ని రోజులు తమ బాధలను వెలిబుచ్చలేకపోయమని.. కానీ ఈరోజు కుట్రంగి తరుణ్ ముందుకొచ్చి తాగుబోతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా తమ తరపున ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉన్నదని పలు వైన్ షాపుల్లో ఉన్న తాగుబోతులు హర్షం వ్యక్తం చేశారు. తరుణ్‌ని శాలువాలతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు తరుణ్ మాట్లాడుతూ.. తాగుబోతుల డిమాండ్లను వినిపించారు. ఎక్కడైతే తాగుబోతులు అనారోగ్యంపాలై ఆసుపత్రులకు వెళ్తారో.. వాళ్లకి తాగుబోతు అని తెలవగానే 25 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే తాగుబోతులను మానసిక వికలాంగులుగా గుర్తిస్తూ ప్రభుత్వం వారికి నెలకు 5000 రూపాయల పింఛన్ ఇవ్వాలన్నారు. తాగి నడుచుకుంటూ వెళ్తుంటే కిందపడి కాళ్లు చేతులు విరిగినట్లయితే వారికి ప్రభుత్వం తరఫున 50 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేయాలని.. ఒకవేళ వాహనం నడుపుతూ చనిపోయినట్లయితే బాధిత కుటుంబానికి 5 లక్షలు సాయం అందించాలని డిమాండ్ చేశారు.


వాళ్ల ఆరోగ్యాన్ని, ఆస్తులను ప్రభుత్వానికి దారబోస్తూ ప్రాణాలను కోల్పోతున్నారు కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రభుత్వం అందజేయాలని తరుణ్ డిమాండ్ చేశారు. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రభుత్వంతో వీరితో చర్చలు జరపాలని, తమ న్యాయమైన డిమాండ్‌లను నెరవేర్చాలని కోరనున్నట్టుగా కొట్రంగి తరుణ్ తెలిపారు.



Latest News
 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం అందరికీ అర్థమైంది,,,మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి Mon, May 20, 2024, 10:00 PM
అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలి,,మాజీ మంత్రి హరీశ్ రావు Mon, May 20, 2024, 09:53 PM
తెలంగాణలో మళ్లీ వానలు.. ఈ జిల్లాల్లోనే, వాతావరణశాఖ హెచ్చరికలు Mon, May 20, 2024, 09:01 PM
తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్.. ఈ రూట్‌లోనే, త్వరలోనే పనులు ప్రారంభం Mon, May 20, 2024, 08:58 PM
కుమార్తెను చంపిన తల్లిదండ్రులు.. తల్లికి దూరమైన 13 నెలల పసికందు Mon, May 20, 2024, 08:54 PM