వైభవంగా భద్రాద్రి రామయ్య కల్యాణం.. శ్రీరామ నామస్మరణతో మార్మోగిన భద్రాచలం వీధులు

byసూర్య | Wed, Apr 17, 2024, 07:49 PM

దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల విందుగా జరిగింది. ఆకాశమంత పందిరి.. భూదేవంత అరుగుపై.. మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణలు, భక్తుల జయజయ ధ్వనాల మధ్య అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు భద్రాద్రి సీతారాముల కల్యాణం జరిగింది. మిథిలా స్టేడియంలో జరిగిన రామయ్య పెళ్లిని తిలకించడానికి వేలాదిగా భక్తుల తరలివచ్చారు. మిథిలా ఉదయం 10:30 గంటలకే కల్యాణ ఘట్టం ప్రారంభం కాగా... శ్రీరామ నామస్మరణతో భద్రాచలం వీధులు మార్మోగుతున్నాయి. కల్యాణాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.


రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎస్‌ శాంతికుమారి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖతో పాటు ప్రజాప్రతినిధులు వేడుకలో పాల్గొన్నారు. ఇక స్వామి వారి కల్యాణానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు, కూలర్లు పెట్టించారు. భక్తుల కోసం 5 లక్షల ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లు, లడ్డూ ప్రసాదాల పంపిణీకి కౌంటర్లు ఏర్పాటు చేశారు. సీతారామచంద్ర స్వామివారికి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం రేపు (ఏప్రిల్ 18) వైభవంగా నిర్వహించనున్నారు. సామూహిక పారాయణం, హోమాలతో పట్టాభిషేకం కత్రువు నిర్వహించనున్నారు.


ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా హాజరు కాలేదు. మామూలుగానేతై ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈసారి వేడుకలకు హాజరై.. పట్టువస్త్రాలు సమర్పిస్తానని రేవంత్ రెడ్డి గతంలో వెల్లడించారు. అయితే కోడ్ అమల్లోకి రావటంతో సీఎం, దేవాదాయశాఖ మంత్రికి బదులుగా సీఎస్ శాంతి కుమారి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు.



Latest News
 

ఎక్సైజ్ ఆధ్వర్యంలో విస్తృత దాడులు Tue, Apr 30, 2024, 01:49 PM
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఓడించండి Tue, Apr 30, 2024, 01:25 PM
మల్లు రవిని ఎంపీగా గెలిపించండి Tue, Apr 30, 2024, 01:23 PM
మే 24న పాలీసెట్ ప్రవేశ పరీక్ష Tue, Apr 30, 2024, 01:21 PM
తెలంగాణ ఇచ్చిన సోనియా తల్లి రుణం తీర్చుకోవాలి: ఎమ్మెల్యే Tue, Apr 30, 2024, 01:17 PM