లారీ డ్రైవర్ బీభత్సం చూశారా.. లారీకి వేలాడుతూ ఆర్తనాదాలు చేస్తున్నా

byసూర్య | Wed, Apr 17, 2024, 07:39 PM

హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఓ లారీ డ్రైవర్ బీభత్సం చేశాడు. బైక్‌ను ఢీకొట్టి, ఆ తర్వాత దాన్ని అలాగే కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్లాడు. బైక్‌ను ఢీకొట్టడంతో ఆ వాహనదారుడు అమాంతం ఎగిరి దూరంగా పడ్డాడు. లారీ ముందు చక్రాల మధ్య బైక్ ఇరుక్కుపోయింది. లారీ డ్రైవర్‌ను స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అతడు వేగం పెంచి లారీని ముందుకు తీసుకెళ్లాడు. అది గమనించిన బైకర్.. లారీ ఎక్కి డ్రైవర్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో లారీ డోర్‌కు ప్రమాదకరంగా వేలాడాడు. లారీ డ్రైవర్ అలాగే కిలోమీటర్ దూరం ముందుకుతీసుకెళ్లాడు. లారీ వెనకాల కారులో వస్తున్న ఓ వ్యక్తి ఈ ఘటనను తన ఫోన్‌లో చిత్రీకరించాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. లారీ ముందు చక్రాల మధ్య ఇరుక్కుపోయిన బైక్.. రోడ్డుతో రాపిడి జరిగి నిప్పు రవ్వలు ఎగశాయి. ఈ భయానక ఘటనతో వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. చాంద్రాయణగుట్టలోని ఒవైసీ హాస్పిటల్ నుంచి వనస్థలిపురం వెళ్లే మార్గంలో అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి, లారీ డ్రైవర్‌ను అరెస్టు చేశారు.


Latest News
 

ఎక్సైజ్ ఆధ్వర్యంలో విస్తృత దాడులు Tue, Apr 30, 2024, 01:49 PM
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఓడించండి Tue, Apr 30, 2024, 01:25 PM
మల్లు రవిని ఎంపీగా గెలిపించండి Tue, Apr 30, 2024, 01:23 PM
మే 24న పాలీసెట్ ప్రవేశ పరీక్ష Tue, Apr 30, 2024, 01:21 PM
తెలంగాణ ఇచ్చిన సోనియా తల్లి రుణం తీర్చుకోవాలి: ఎమ్మెల్యే Tue, Apr 30, 2024, 01:17 PM