కాంగ్రెస్‌ను టచ్ చేస్తే.. బీఆర్ఎస్‌ పునాదులు కూడా లేకుండా చేస్తాం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

byసూర్య | Wed, Apr 17, 2024, 07:25 PM

కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండదని.. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంధ్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటుగా స్పందించారు. దోపిడీ సొమ్ముతో కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీని టచ్ చేస్తే... హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యలయం పునాదులు కూడా లేకుండా చేస్తామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. నల్గొండ పట్టణంలో పర్యటించిన సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. పర్యటనలో భాగంగా.. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం.. శ్రీరామనవమి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు.


బీఆర్ఎస్ పార్టీకి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తామంటున్నారని.. కానీ తాము వద్దంటున్నామని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. తాము తలుచుకుంటే కనీసం 9 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండరని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి లిల్లీ పుట్ అంటారా అంటూ కేసీఆర్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి.. ప్రజల నుంచి వచ్చిన నాయకుడని.. దొంగ పాస్‌పోర్టులు తయారు చేయలేదన్నారు. కూతురు జైలుకు పోయినా బుద్ధి మారలేదా అంటూ కేసీఆర్‌‌ను కోమటిరెడ్డి దుయ్యబట్టారు.


సీఎం రేవంత్ రెడ్డి ముఖం చూసే ధైర్యం లేకనే రెండు సార్లు కేసీఆర్ అసెంబ్లీకి రాలేదని కోమటిరెడ్డి ఆరోపించారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటూ రాదని... 12 నుంచి 13 సీట్లలో కాంగ్రెస్ మాత్రమే గెలుస్తుందన్నారు. కవిత జైలుకు వెళ్లాక కేసీఆర్‌కు పిచ్చెక్కినట్టు ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకే.. రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతున్నారంటూ ఏవేవో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రెండేళ్లైనా కవితకు బెయిల్ రాదని వెంకట్ రెడ్డి తెలిపారు.


Latest News
 

లవర్‌తో ఓయో రూమ్‌కు.. తెల్లారేసరికి విగతజీవిగా యువకుడు, ఏం జరిగింది? Tue, Apr 30, 2024, 09:05 PM
హైదరాబాద్‌లో లేడీ డాన్,,,గుట్టు చప్పుడు కాకుండా గేమింగ్ Tue, Apr 30, 2024, 08:10 PM
అన్నదాతకు గుడ్‌న్యూస్.. రైతుబంధు నిధులపై డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన Tue, Apr 30, 2024, 08:05 PM
5 వేల పింఛన్, 5 లక్షల ఆర్థిక సాయం.. తాగుబోతుల సంక్షేమ సంఘం డిమాండ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే! Tue, Apr 30, 2024, 08:01 PM
వియ్యంకుడి కోసం రంగంలోకి విక్టరీ వెంకటేశ్.. ఆ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం Tue, Apr 30, 2024, 07:41 PM