byసూర్య | Mon, Apr 08, 2024, 03:18 PM
విశ్వ జ్యోతిష్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో సోమవారం రాజమండ్రిలో నిర్వహించిన పురస్కార కార్యక్రమంలో నారాయణపేట కు చెందిన సాయిబాబా గుడి అర్చకులు మఠం రాజ్ కుమార్ స్వామి స్వర్ణ కంకణం, క్రోధి నామ సంవత్సర ఉగాది పురస్కారం అందుకున్నారు. సంస్థ చైర్మన్ జొన్నలగడ్డ శ్రీనివాస్ రావు, కార్యదర్శి విశ్వనాథ శర్మ, పంచాంగ కర్త ఇంద్రకంటి గోపాలకృష్ణ చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నట్లు చెప్పారు. పలువురు అభినందించారు.