byసూర్య | Mon, Apr 08, 2024, 03:18 PM
ఉప్పల్ నియోజకవర్గం హెచ్ఎండిఏ లే అవుట్ లోని స్వయంభు కాలభైరవ స్వామి దేవాలయంలో సోమవారం మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పార్లమెంటు ఎన్నికలల్లో బీఅర్ఎస్ అధిక ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని అన్నారు.