byసూర్య | Mon, Apr 08, 2024, 03:18 PM
ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీలో గల, శ్రీ శివాలయం ప్రాంగణములో నెలకొనియున్న శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో ఉగాది సందర్భంగా శ్రీ కోదండ రామస్వామి వారికి విశేష పంచామృత అభిషేకం నిర్వహించనున్నట్లు, శ్రీ శివాలయం ఆలయ కార్య నిర్వహణ అధికారి పార్థ సారధి సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. తదుపరి స్వామి వారికి అలంకరణ, ధూపదీప నైవేద్య సమర్పణ, తదనంతరం ప్రసాద వితరణ కార్యక్రమాలు జరుపనున్నట్లు తెలిపారు.