byసూర్య | Mon, Apr 08, 2024, 03:11 PM
ఖమ్మం జిల్లాలో చికెన్ కు డిమాండ్ పెరిగింది. గత వారం వరకు కిలో రూ. 220 నుంచి రూ. 250 వరకు ఉన్న చికెన్ ధర ఒక్కసారిగా పెరిగింది. ప్రాంతం, డిమాండ్ ఆధారంగా కిలో చికెన్ రూ. 300 పైగానే విక్రయిస్తున్నారు. ఓ వైపు పండుగలు, మరో వైపు శుభకార్యాల సీజన్ కావటంతో చికెన్ వినియోగం గణనీయంగా పెరిగింది. వినియోగానికి తగిన కోళ్ల ఉత్పత్తి లేక పోవటంతో ధరలకు రెక్కలొచ్చాయి. వేసవి ఉష్ణోగ్రతల కారణంగా కోళ్ల ఉత్పత్తి తక్కువగా ఉంది.