byసూర్య | Mon, Apr 08, 2024, 03:10 PM
యూపీ నుంచి పొట్ట చేత పట్టుకుని ఖమ్మం వచ్చిన కార్మికుడు వినయ్ నగరంలోని న్యూమోహన్ సాయి ఫైనాన్స్ సంస్థ వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు యర్రా శ్రీకాంత్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వినయ్ ది ఆత్మహత్య కాదని, దీనిని హత్య కేసుగా నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం నగరంలో ఫైనాన్స్ కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయని, వీటి ఆగడాలు మితిమీరుతున్నాయన్నారు.