byసూర్య | Mon, Apr 08, 2024, 03:10 PM
వేంసూర్ మండలంలోని వేంసూర్, మర్లపాడు, బీరాపల్లి తదితర గ్రామాలలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు గ్రామపంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో చలివేంద్ర కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుండి 40 డిగ్రీల ఉష్ణోగ్రతతో భానుడి ప్రతాపానికి పిల్లలు, పెద్దలు దప్పికతో విలవిల్లాడుతు ఉంటారు. వారి దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.