byసూర్య | Mon, Apr 08, 2024, 03:09 PM
కూసుమంచి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న చనగకుంట నుంచి అక్రమంగా మట్టి తోలకాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు ఆరోపించారు. అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. తక్షణమే సంబంధిత శాఖ అధికారులు స్పందించి అక్రమ మట్టి రవాణా చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులకు ఒక ట్రక్కు మట్టి ఎనిమిది వందల రూపాయలకు విక్రయిస్తున్నారు.