byసూర్య | Mon, Apr 08, 2024, 03:09 PM
ఖమ్మం నగరంలోని మయూరి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని డీఎంహెచ్ఓ డా. మాలతి తమ సిబ్బందితో సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అల్లోపతిక్ చట్ట నిబంధనలు పాటించకుండా ఆస్పత్రి నిర్వహిస్తున్నట్టు, ఆపరేషన్ థియేటర్ లో నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగించిన వాయిల్స్, లోడెడ్ సిరంజెస్ ఉంచటం గుర్తించారు. దీంతో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసు జారీ చేశారు. నిబంధనలు పాటించకుండా ఆస్పత్రిని నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.