byసూర్య | Mon, Apr 08, 2024, 03:08 PM
ఉగాది పండుగ సందర్భంగా ఖమ్మం కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో రైతులను సన్మానించనున్నట్టు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎర్నేని రామారావు, గొడవర్తి నాగేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఖమ్మం నగరంలోని స్వర్ణభారతి కళ్యాణ మండపంలో ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నామని, ఈ వేడుకల్లో చిరుధాన్యాలు, ఇతర పంటల సేద్యంలో నిష్నాతులైన పది మంది రైతులను సత్కరించనున్నట్లు వారు తెలిపారు.