విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త.. మార్చి 31 నుంచి వేసవి సెలవులు

byసూర్య | Fri, Mar 29, 2024, 08:05 PM

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ముగియడంతో సెలవులపై ఇంటర్మీడియట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్‌ కాలేజీలకు మార్చి 30వ తేదీ ఈ విద్యాసంవత్సరానికి చివరి పనిదినంగా ప్రకటించింది. ఈనెల 30 నుంచి మే 31 వరకు ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ఇస్తున్నట్టు తెలిపింది. జూన్ 1న తిరిగి తరగతులు పునఃప్రారంభమవుతాయని పేర్కొంది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. తమ ఆదేశాలను బేఖాతరు చేస్తూ వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రయివేట్ కాలేజీలను హెచ్చరించింది. బోర్డు ప్రకటించిన షెడ్యూల్ మేరకే అడ్మిషన్లు చేపట్టాలని స్పష్టం చేసింది.


మరోవైపు, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల పేప‌ర్‌ వాల్యూయేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియను మొత్తం నాలుగు దశల్లో పూర్తి చేసేందుకు కార్యాచరణను రూపొందించారు. ఇప్పటికే రెండు విడతల‌ వాల్యూయేషన్ పూర్తయ్యింది. ప్రస్తుతం మూడో విడత వాల్యూయేషన్ నడుస్తోంది. ఈ నెలాఖారు లోపు నాలుగు విడుతల వాల్యూయేషన్ ప్రక్రియను పూర్తి చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు.


విద్యార్థుల సమాధాన పత్రాల కోడింగ్‌ వ్యవస్థను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, కార్పొరేట్‌ కాలేజీల ప్రలోభాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని బోర్డు అధికారులు వెల్లడించారు. మూల్యాంకనం పూర్తయి పత్రాల వివరాలు ఎప్పటికప్పుడు రాష్ట్ర కార్యాలయానికి అందేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ పరీక్షలకు మొత్తం 9,22,520 మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 16 కేంద్రాల్లో మూల్యాంకనం జరుగుతోంది. సబ్జెక్టుల వారీగా దాదాపు 20 వేల మంది అధ్యాపకులు మూల్యాంకన ప్రక్రియలో నిమగ్నమయ్యారు.


గతంలో ఎలాంటి ఆరోపణలు లేని ప్రభుత్వ అధ్యాపకులతో పాటు, ఇంటర్‌ బోర్డు గుర్తింపు పొందిన ప్రైవేటు కాలేజీల అధ్యాపకులను స్పాట్‌ కోసం ఎంపిక చేసింది. ఒక్కో అధ్యాపకుడికి ఉదయం 15 పేపర్లు, సాయంత్రం 15 పేపర్లు చొప్పున రోజుకు మొత్తం 30 పేపర్లు మాత్రమే మూల్యాంకనానికి ఇస్తున్నారు. దీనివల్ల నాణ్యమైన మూల్యాంకనం జరుగుతుందని పరీక్షల విభాగం అధికారులు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వీలైనంత త్వరగా ఫలితాలను వెల్లడించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. గతేడాది మే 9న ఫలితాలు వెల్లడి కాగా.. ఈ దఫా అంతకు ముందే వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకూ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.


Latest News
 

6 హామీలలో 5 హామీలు అమలయ్యాయి: కాంగ్రెస్ Sun, Apr 28, 2024, 10:24 AM
వైరా క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం Sun, Apr 28, 2024, 10:22 AM
ఆటోని ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం వ్యక్తికి తీవ్రగాయాలు Sun, Apr 28, 2024, 10:21 AM
బెల్ట్ షాపులు ద్వారా మద్యం విక్రయాలు చేస్తే చర్యలు Sun, Apr 28, 2024, 10:20 AM
ఖమ్మం నగరంలో కేంద్ర సాయుధ పోలీస్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ Sun, Apr 28, 2024, 10:17 AM