కుమార్తెతో కలిసి ఢిల్లీకి కడియం శ్రీహరి.. కాంగ్రెస్‌లో చేరిక?

byసూర్య | Fri, Mar 29, 2024, 08:06 PM

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలాపడ్డ బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా, వరంగల్ జిల్లాలో ఆ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కారు దిగేందుకు సిద్ధమయ్యారు. వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన కడియం కుమార్తె కావ్య ఇప్పటికే తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో కుమార్తెతో కలిసి ఆయన ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారని సమాచారం. తండ్రీకూతుళ్లు కలిసి ఢిల్లీకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. శనివారం ఉదయం 9 గంటలకు కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారని మీడియా వర్గాల్లో వార్త చక్కెర్లు కొడుతోంది.


వరంగల్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. కాంగ్రెస్‌లో కడియం చేరికతో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. కడియం శ్రీహరి బీఆర్ఎస్‌‌ను వీడటం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ పార్టీకి గట్టి దెబ్బే తగిలే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కడియం కావ్య గురువారం రాత్రి ప్రకటించారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ విషయంపై కావ్య లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, భూకబ్జాల వంటి ఆరోపణలతో పార్టీ ప్రతిష్ఠ మసకబారి, జనాదరణ కరువైన నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు కావ్య పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్‌లో చేరనున్నారు.


ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్‌లోని ఒక్క స్టేషన్‌ ఘన్‌పూర్‌లో మాత్రమే గులాబీ జెండా రెపరెపలాడింది. ఆ ఒక్క స్థానంలో గెలిచి పార్టీని కొన ఊపిరితో నిలిపిన కడియం సైతం బీఆర్ఎస్‌లో జరుగుతున్న తాజా పరిణామాలతో ఇక తాను ఉండలేననే నిర్ణయానికొచ్చినట్టు సమాచారం. ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్లడం ఖాయమే అన్న చర్చ జోరుగా సాగుతోంది. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్‌ కీలక నేతలు కడియం శ్రీహరితో మంతనాలు జరుపుతున్నారని తెలిసింది. ఆచీతూచీ వ్యవహరిస్తున్న కడియం.. ముందుగా తన కుమార్తెను లోక్‌సభ బరి నుంచి తప్పించారు


Latest News
 

తెలుగు రాష్ట్రాలకు వాతవరణ శాఖ కీలక సూచన.. పోలింగ్‌ రోజు ఆగమాగమే Sat, May 11, 2024, 11:58 PM
సీఎం ఆఫీసులో పెత్తనమంతా ఆయనదే.. నేను ఉత్త రబ్బర్ స్టాంపునే: రేవంత్ రెడ్డి Sat, May 11, 2024, 11:56 PM
సికింద్రాబాద్ ఎంపీ సీటు బీఆర్ఎస్ కే సొంతం Sat, May 11, 2024, 09:49 PM
బీజేపీకి మద్దతు తెలిపిన అగర్వాల్ సమాజ్ Sat, May 11, 2024, 09:47 PM
లోక్ సభ ఎన్నికల బందోబస్తును సమర్థవంతంగా నిర్వహించాలి Sat, May 11, 2024, 09:46 PM