నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

byసూర్య | Sat, Mar 02, 2024, 11:33 AM

కోకాపేట సబేస్టేషన్ పరిధిలో నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ సందీప్ రెడ్డి తెలిపారు. వైర్లకు దగ్గరగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగిస్తున్న నేపథ్యంలో ఓషియన్ పార్క్, బాబుఖాన్ విల్లాస్, 250 గజాల కాలనీ, లెజెండ్ విల్లాస్, పావని విల్లాస్, గండిపేట నుంచి శంకర్పల్లి రోడ్డు, ఘర్ కార్పొరేషన్, ప్రైవేట్ 28 విల్లాల ప్రాం తాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12: 30 గంటల వరకు సరఫరా ఉండదని పేర్కొన్నారు.
ఫలక్ నుమా విద్యుత్ ఫీడర్ పరిధిలోని చాంద్రాయణగుట్ట, డీఆర్డీఎల్, నసీబ్ నగర్, పూల్ బాగ్, నందిని నగర్ లలో శనివారం మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు విద్యుత్ సరఫరా లో అంతరాయం కలగనుందని ఏడీఈ తెలిపారు. కందికల్ గేట్, జీఎం కాలనీ, తాళ్లకుంటలో 2 నుంచి 3 వరకు, సాయిబాబా నగర్, శివాజీ నగర్ లలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 వరకు సరఫరాలో అంతరాయం కలుగుతుండడాన్ని వినియోగదారులు గమనించాలన్నారు.


Latest News
 

పీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ Sat, Sep 21, 2024, 01:01 PM
కొండా లక్ష్మణ్‌ బాపూజీకి కేటీఆర్ నివాళి Sat, Sep 21, 2024, 12:29 PM
కామారెడ్డి జిల్లాలో ఓ విషాద ఘటన Sat, Sep 21, 2024, 12:00 PM
రాత్రి కుండపోత.. ఇవాళ భారీ వర్షాలు Sat, Sep 21, 2024, 11:43 AM
డిండి ఎత్తిపోతల పూర్తి చేయాలి Sat, Sep 21, 2024, 11:38 AM