byసూర్య | Fri, Dec 01, 2023, 12:01 PM
పాలమూరు ఉమ్మడి జిల్లాలో జిల్లాలో డిసెంబర్ 1(శుక్రవారం )నుంచి కొత్త పాలసీ అమలలోకి రానుంది. 3 నెలల క్రితమే దుకాణాలకు టెండర్లు వేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 230 మద్యం దుకాణాలకు ఆగస్టు 4 నుంచి 16 వరకు దరఖాస్తులు ఆహ్వానించింది. 20న లక్కీడీప్ ద్వారా దుకాణాలను కేటాయించారు. డిసెంబర్ 1, 2 న మద్యం స్టాకు తెచ్చుకుని దుకాణాలను ఏర్పాటు చేసుకోనున్నారు. ఇప్పటికే కొందరు దుకాణాలు సిద్ధం చేశారు.