byసూర్య | Fri, Dec 01, 2023, 12:04 PM
హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ఉదయం మార్నింగ్ వాక్ నిర్వహించారు. పట్టణ కేంద్రంలోని మల్లెచెట్టు చౌరస్తా నుండి ఎల్లమ్మ చెరువు కట్ట వరకు స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి వాకింగ్ చేశారు. అనంతరం పేపర్ వేస్తున్న పిల్లవాడిని పలకరించి రోడ్డు పక్కన టీ హోటల్లో చాయ్ తాగి ఓటింగ్ సరళిని గురించి అడిగి తెలుసుకున్నారు.ఇక మాజీ ఎంపీ, హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ఓటు వేయడానికి ముందు గ్యాస్ సిలండర్‌కు పూజ చేశారు. ఇంట్లో కుటుంబసభ్యులతో కలిసి గ్యాస్ సిలిండర్‌కు పూజలు చేశారు. గ్యాస్ సిలిండర్‌కు పూల దండ వేసి రూ.500 నోటును అతికించి పూజ చేశారు. అనంతరం తన స్వగ్రామంలో ఓటేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రూ. 500 వందలకే గ్యాస్ సిలిండర్ అని ప్రకటించారు. అదే విషయాన్ని సందేశం ఇచ్చేలా పొన్నం వెరైటీగా ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది