byసూర్య | Fri, Dec 01, 2023, 12:09 PM
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 10 ప్రత్యేక రైళ్లను డిసెంబరు ఆఖరివారం వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్-తిరుపతి (07482) రైలు ప్రతి సోమవారం, తిరుపతి-సికింద్రాబాద్ రైలు (07481) ప్రతి ఆదివారం, హైదరాబాద్-నర్సాపూర్ (07631) రైలు ప్రతి శనివారం, నర్సాపూర్-హైదరాబాద్ రైలు (07632) ప్రతి ఆదివారం, కాకినాడ-లింగంపల్లి రైలు (07445) ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో, లింగంపల్లి-కాకినాడ రైలు (07446) ప్రతి మంగళ, గురు, శనివారాల్లో బయల్దేరతాయి.