అమీన్ పూర్ పురపాలకసంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ అధ్యక్షతన సమావేశం

byసూర్య | Wed, Oct 30, 2024, 02:31 PM

గౌరవనీయులైన పత్రికా విలేకరుల మిత్రులు అందరికి నమస్కారములు..తేదీ 30.10.2024 న ఉదయం 11.00 గంటలకు అమీన్ పూర్ పురపాలక సంఘ కార్యాలయంలో శ్రీ తుమ్మల పాండురంగా రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గారి అధ్యక్షతన,మరియు శ్రీమతి ఎ. జ్యోతి రెడ్డి మున్సిపల్ కమిషనర్ గారు ఏర్పాటు చేసిన సాదారణ సమావేశం నందు  గౌరవ వార్డు సభ్యులు , కోఆప్షన్ సభ్యులు పాల్గొని ఈ క్రింది ఎజెండాలో పొందుపరిచిన అంశములు అన్నింటిని తీర్మానించి ఆమోదిం చడమైనది.వివిధ అభివృద్ది పనులకు గాను మున్సిపల్ సాధారణ నిధులనుండి 10 కోట్ల.40 లక్షల రూపాయలను మౌలిక సదుపాయాల నిర్వహణ, Roads, Sanitation , Maintenance of  Works , హరిత హారం  ప్రతిపాదనలతో పనులు చేపట్టుటకు కౌన్సిల్ ఆమోదం జరిగింది. కౌన్సిల్ సభ్యులు వారి యొక్క వార్డులలో ఉన్నటువంటి Roads, UGD, కి సంబంధించిన పనులను గౌరవ చైర్ పర్సన్ గారి దృష్టికి తీసుకువచ్చి చర్చించడం జరిగినది,వెంటనే అట్టి పనులను వేగవంతం చేసి పూర్తి చేయవలసిందిగా  సంబంధిత అదికారులను ఆదేశించడం జరిగినది, మరియు నూతంగా విలీనమైన 6 గ్రామ పంచాయతీ లో అత్యవసరమైన పనులకు కౌన్సిల్ సభ్యులు చర్చించి ఆమోదించినారు, అమీన్పూర్ మున్సిపాలిటీని  అభివృద్ధి పథంలో  ముందుకు తీసుకెళ్ళవలసిన  బాధ్యత తనతో పాటుగా గౌరవ కౌన్సిల్ సభ్యులు అందరికీ ఉన్నందున తమ దృష్టికి  వచ్చిన ప్రజా సమస్యలను వెంట వెంటనే పరిష్కరించుటకు కృషి చేయవలసిందిగా  గౌరవ చైర్ పర్సన్ గారు కౌన్సిల్ సభ్యులను కోరినారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఆర్ ఓ మధుసూదన్ రెడ్డి గారు,వెంకట రమణ De, ప్రవీణ్ AE,రామకృష్ణ,(ఎలెక్ట్రికల్ A.E),రాజేష్(ఎలెక్ట్రికల్ A.E),పూర్ణేశ్వరి (HMWS),ప్రవీణ్ కుమార్ (HMWS), పంచాయత్ సెక్రటరీ లు మరియు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది  పాల్గొన్నారు.


Latest News
 

తిరుమల శ్రీవారి సేవలో రేవంత్ రెడ్డి సతీమణి గీత రెడ్డి Wed, Oct 30, 2024, 04:15 PM
ఎంపీ రఘునందన్ హాట్ కామెంట్స్ Wed, Oct 30, 2024, 04:13 PM
నూతన కూరగాయల మార్కెట్ 1. 14 కోట్లతో భూమి పూజ చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. Wed, Oct 30, 2024, 04:07 PM
మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే Wed, Oct 30, 2024, 04:04 PM
జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త Wed, Oct 30, 2024, 03:59 PM