byసూర్య | Fri, Dec 01, 2023, 12:31 PM
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఓట్ల లెక్కింపునకు ఈసీ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ సహా జిల్లా కేంద్రాల్లోని పలు విద్యా సంస్థలు, కార్యాలయాల్లో లెక్కింపు కేంద్రాలు సిద్ధం చేస్తున్నారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. కాగా ఈ నెల 3 ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిన్న రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పలు జిల్లాల్లో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఎన్నికల సంఘం అధికారులు వాటి స్థానంలో కొత్త ఈవీఎంలను అమర్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న రాత్రి వరకు మొత్తం పోలింగ్ శాతం 70.60గా వెల్లడైంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద భారీ భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులు, ఆర్మ్ డ్ రిజర్వ్, కేంద్ర బలగాలతో స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల కమిషన్ అనుమతి ఉన్నవారికే స్ట్రాంగ్ రూమ్స్‌లోకి అనుమతిస్తున్నారు. ఇతరులకు ఎవరికి స్ట్రాంగ్ రూమ్‌లోకి అనుమతి లేదన్నారు. ఒక డీసీపీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్ఐలతో పాటు ఇతర సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.