byసూర్య | Wed, Oct 30, 2024, 11:56 AM
దీపావళి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని దీపావళి వేడుకలలో బాణసంచా వాడకాన్ని నియంత్రించి పర్యావరణాన్ని కాపాడుకుందామని హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకట్ బుధవారం పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు పురపాలక సంఘ ఆధ్వర్యంలో "స్వచ్ దీవాలి శుభ్ దీవాలి" కార్యక్రమములో మాట్లాడుతూ పట్టణ ప్రజలందరూ దీపావళి పండుగ సందర్భంగా దీపాలు వెలిగించుటకు మట్టి దివ్వెలు వాడాలని అన్నారు.