జన్వాడ ఫామ్‌హౌస్‌ కేసు...మోకిల పీఎస్‌ కు రాజ్ పాకాల..

byసూర్య | Wed, Oct 30, 2024, 12:10 PM

జన్వాడ ఫామ్‌హౌస్‌ కేసు వ్యవహారం స్టేట్ పాలిటిక్స్‌ లో హాట్ టాపిక్‌గా మారింది. కేసుకు సంబంధించి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్  నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.అయితే, కేసులో A1గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) బావమరిదికి రాజ్ పాకాల  పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు తెలంగాణ హైకోర్టు  మంగళవారం వరకు గడువు ఇచ్చింది. ఈ క్రమంలో ఇవాళ ఆయన తన అడ్వొకేట్‌తో కలిసి మధ్యాహ్నం 12 గంటకు మోకిల పీఎస్‌ కు రానున్నారు. ఇప్పటికే రాజ్ పాకాలకు పోలీసులు నోటీసులు జారీ చేయడంతో ఇవాళ ఆయనను విచారించే అవకాశం ఉంది.కాగా, ఇదే కేసులో మరో కీలక నిందితుడైన విజయ్ మద్దూరి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. ఈ మేరకు రాత్రి ఆయన ఇంట్లో పోలీసుల తనిఖీలు తనిఖీలు నిర్వహించారు. కేసులో విజయ్ ఫోన్ కీలకంగా మారడంతో దానిని స్వాధీనం చేసుకునేందుకు సోదాలు నిర్వహించారు. కానీ, విజయ్ మద్దూరి అందుబాటులో లేడని పోలీసులు తెలిపారు. అదేవిధంగా జన్వాడ ఫామ్‌ హౌస్‌ లో పార్టీ జరిగిన రోజు తన ఫోన్ బదులుగా వేరే మహిళ ఫోన్‌ను విజయ్ పోలీసులకు ఇచ్చాడు. దీంతో తన ఫోన్ తనకు ఇవ్వాలంటూ సోమవారం సదరు మహిళ మోకిల పోలీసులను  ఆశ్రయించింది. దీంతో ఆ మహిళ స్టేట్‌మెంట్‌ను కూడా పోలీసులు రికార్ట్ చేశారు.


 


 


Latest News
 

కశ్మీర్‌లో చిక్కుకున్న తెలంగాణ పర్యాటకులకోసం.... హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు Thu, Apr 24, 2025, 07:22 PM
తెలంగాణలో భీకర ఎండలు.. వడదెబ్బతో ఒక్కరోజే ఏడుగురు బలి Thu, Apr 24, 2025, 07:16 PM
స్మితా సబర్వాల్ తప్పేమీ లేదు.. దానం నాగేందర్‌ Thu, Apr 24, 2025, 07:12 PM
నేడు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం... కేటీఆర్ ట్వీట్ Thu, Apr 24, 2025, 04:14 PM
వరంగల్ సభకు అధిక సంఖ్యలో హాజరుకావాలి: జీవన్ రెడ్డి Thu, Apr 24, 2025, 04:10 PM