byసూర్య | Wed, Oct 30, 2024, 01:01 PM
బీజేపీ తెలంగాణా మీద ఫోకస్ పెడుతోంది. జమిలి ఎన్నికల నేపథ్యంలో దక్షిణాదిన తెలంగాణ మీదనే బీజేపీ ఆశలు అధికంగా ఉన్నాయి. తెలంగాణలో ఈసారి ఎన్నికలు అంటూ వస్తే మరింతగా బలపడాలని BJP లెక్కలు వేసుకుంటోంది. అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మరోసారి బండి సంజయ్‌ను నియమించేందుకు బీజేపీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఎంపీ ఈటను కేంద్ర మంత్రి వర్గంలో తీసుకుని బండికి అధ్యక్ష పదవి ఇవ్వాలనే యోచనలో బీజేపీ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.