byసూర్య | Fri, Dec 01, 2023, 12:33 PM
గద్వాల: తుమ్మిళ్ల ఇసుక తరలింపులో భారీ కుంభకోణం జరుగుతుందని ఇసుక తరలింపు టిప్పర్ యజమానులు శుక్రవారం అన్నారు. కేవలం 10 రోజులలో తుమ్మిళ్ల ఇసుక రీచ్ తీసుకున్న కాంట్రాక్టర్ రూ. 50 లక్షలు అక్రమంగా సంపాదించినట్లు టిప్పర్ యజమానులు తెలిపారు. ఒక టిప్పర్ కు 20 టన్నుల ఇసుక రూ. 10 వేలకు క్వారీ వద్ద లోడ్ చేసి ఇవ్వాల్సి ఉండగా అదనంగారూ. 7700 తీసుకొని దోపిడీ చేస్తున్నట్లు యజమానులు ఆరోపిస్తున్నారు.