అధికారం కోసం మూడు పార్టీలు వ్యూహాలు ?

byసూర్య | Fri, Dec 01, 2023, 12:39 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ఓవరాల్‌గా చూస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఐతే.. వీటిని నమ్మాలా వద్దా అనేది పెద్ద సమస్య.తాము అనుకున్న పార్టీ అధికారంలోకి వస్తుంది అని ఎగ్జిట్ పోల్స్ చెబితే.. అవి కరెక్ట్ అంటారు చాలా మంది. అలా కాకుండా.. తాము అనుకున్న పార్టీ కాకుండా మరో పార్టీ అధికారంలోకి వస్తుంది అని ఎగ్జిట్ పోల్స్ చెబితే, అవి రాంగ్ అంటారు చాలా మంది. అందువల్ల మనం వీటిని నమ్మాలా వద్దా అనే దానిపై ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయి. ఐతే.. రెండ్రోజుల్లో మనం అసలైన ఫలితాలు చూస్తాం. ఆ ఫలితాలు అసలైనవి కాబట్టి.. వాటిని మనం అంగీకరిస్తాం. ఆ తీర్పు ఏదైనా మనం ఒప్పుకుంటాం. ఐతే పార్టీలకు మాత్రం ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ పెద్ద పనే పెట్టాయి.


కాంగ్రెస్ వైపు నుంచి చూస్తే, ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని చాలా ఎగ్జిట్ పోల్స్ చెప్పినా.. క్లియర్ మెజార్టీ వస్తుందా అనేది ఆ పార్టీకి టెన్షన్ పెడుతోంది. మెజార్టీ రాకపోతే, MIM, ఇతరలు సపోర్ట్ లభిస్తుందా? ఒకవేళ MIM సపోర్ట్ ఇస్తే, ఆ పార్టీ ఎలాంటి కోరికలు కోరుతుందో అనే టెన్షన్ కాంగ్రెస్‌లో ఉంది.బీఆర్ఎస్ విషయానికి వస్తే, తమ కంటే కాంగ్రెస్‌కి ఎక్కువ సీట్లు వస్తాయేమో, ఒకవేళ అలా వస్తే, ఆ పార్టీ సొంతంగా కానీ లేక, ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందేమో అనే టెన్షన్ ఉంది. పైకి మాత్రం తామే మూడోసారి అధికారంలోకి వస్తామని ఆ పార్టీ చెబుతోంది. ఐతే.. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సీట్ల తేడా పెద్దగా లేకపోవడం.. గులాబీ పార్టీకి ఒకింత ధైర్యాన్ని ఇస్తోంది.


బీజేపీ నేతలు తాము అధికారంలోకి రాము అనే ఆలోచనలకు వచ్చేసినట్లు కనిపిస్తోంది. ఐతే.. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే మాత్రం, అందుకు బలమైన కారణాల్లో బీజేపీ ఒకటి అవుతుంది అంటున్నారు. బీజేపీ బలంగా పోటీ చెయ్యకపోయి ఉంటే.. ఈ పార్టీకి అదనంగా వచ్చే సీట్లు, ఓట్లు కాంగ్రెస్‌కి వచ్చేవన్న వాదన ఉంది. అందువల్ల కాంగ్రెస్ ఆశలపై బీజేపీ నీళ్లు చల్లుతుందా అనే కోణం కూడా తెరపైకి వస్తోంది.


ఈ ఎగ్జిట్ పోల్స్‌లో అత్యంత ఆనందంగా ఉన్న పార్టీ మాత్రం MIM. ఈ పార్టీ తమ రెగ్యులర్ స్థానాలను తిరిగి సంపాదించుకుంటుందని అంచనాలు చెబుతున్నాయి. ఏ పార్టీకీ క్లియర్ మెజార్టీ రాకపోతే మాత్రం మజ్లిస్ పార్టీ సపోర్ట్ కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల మజ్లిస్ నేతలు ఫుల్ ఖుషీగా ఉన్నారు. చూద్దాం. 3వ తేదీ ఎంతో దూరంలో లేదు కదా.


Latest News
 

తెలంగాణ టీపీసీసీ లో సోషల్ మీడియా సెక్రటరీ గ జంగా శ్రీనివాస్ నీయమకం Wed, Oct 30, 2024, 12:18 AM
తెలంగాణ టీపీసీసీ సోషల్ మీడియా సెక్రటరీ గ జంగా శ్రీనివాస్ నీయమకం Wed, Oct 30, 2024, 12:17 AM
తెలంగాణ టీపీసీసీ సోషల్ మీడియా సెక్రటరీ గా జంగా శ్రీనివాస్ నీయమకం Tue, Oct 29, 2024, 11:45 PM
బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎవరికైనా ఇస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త Tue, Oct 29, 2024, 11:16 PM
తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. ఆ డేరింగ్ లేడీ ఆఫీసర్‌కు కీలక బాధ్యతలు Tue, Oct 29, 2024, 11:06 PM