శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో, ఎయిరిండియా విమానాలకు బాంబు బెదిరింపు.

byసూర్య | Wed, Oct 30, 2024, 10:44 AM

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 6 విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించారు.దేశంలోని వివిధ విమానయాన సంస్థలు నడుపుతున్న 100కుపైగా విమానాలకు మంగళవారం బాంబు బెదిరింపులు వచ్చినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. దీంతో 16 రోజుల వ్యవధిలో 510కు పైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు బెదిరింపులు వచ్చినట్లైంది.మరోవైపు విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో ఈ కుట్ర వెనకాల ఓ పుస్తక రచయిత ఉన్నట్లు మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి గోండియాకు చెందిన జగదీశ్‌ ఉయికే అని నాగ్‌పుర్‌ పోలీసులు తెలిపారు. గతంలో ఉగ్రవాదంపై పుస్తకం రచించిన ఈ వ్యక్తి 2021లో ఓ కేసులో అరెస్టయినట్లు వెల్లడించారు. ఈ వ్యక్తి ఇ-మెయిల్‌ ద్వారా పలు విమానయాన సంస్థలకు నకిలీ బాంబు బెదిరింపు సందేశాలు పంపించాడని, దీని కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడిచినట్లు పోలీసులు పేర్కొన్నారు.


Latest News
 

ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలి Tue, Nov 12, 2024, 09:56 PM
తెలంగాణకు మళ్లీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ Tue, Nov 12, 2024, 09:51 PM
గాయపడిన వ్యవసాయకులను పరామర్శించిన దేవరకద్ర ఎమ్మెల్యే సతీమణి Tue, Nov 12, 2024, 09:51 PM
ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. కొత్తగా 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు, ఇక ఆ టెన్షన్ లేదు Tue, Nov 12, 2024, 09:50 PM
వికారాబాద్ జిల్లా కలెక్టర్ మీద దాడి కేసులో నిందితులకు కోర్టు రిమాండ్ Tue, Nov 12, 2024, 09:50 PM