byసూర్య | Wed, Oct 30, 2024, 10:13 AM
ఫార్ములా-ఈ కార్ల రేస్ వ్యవహారంలో జరిగిన ఉల్లంఘనలపై విచారణ జరపాలంటూ అవినీతి నిరోధక శాఖకు పురపాలక, పట్టణాభివృద్ధి సంస్థ (ఎంఏయూడీ) ముఖ్యకార్యదర్శి దానకిశోర్ మంగళవారం లేఖ రాశారు. విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా ఏసీబీ చర్యలు తీసుకోనుంది. ఎలాంటి అనుమతులు లేకుండానే నిధుల చెల్లింపుపై ప్రధానంగా విచారణ జరపనున్నారు. ఇందులో విదేశీ సంస్థకు నిధుల బదిలీ అంశం ఉండటంతో ఈడీ కూడా రంగంలోకి దిగే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.