byసూర్య | Fri, Dec 01, 2023, 11:47 AM
తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, హ్యట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్ర సృష్టించనున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి దయవల్ల ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నానని తెలిపారు. ఎన్నికల్లో తెలంగాణవ్యాప్తంగా పింక్ వేవ్ కనిపించిందని పేర్కొన్నారు.