byసూర్య | Fri, Dec 01, 2023, 11:43 AM
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఓట్ల లెక్కింపునకు ఈసీ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ సహా జిల్లా కేంద్రాల్లోని పలు విద్యా సంస్థలు, కార్యాలయాల్లో లెక్కింపు కేంద్రాలు సిద్ధం చేస్తున్నారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. కాగా ఈ నెల 3 ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో డిసెంబర్ 3న కౌంటింగ్పై ఈ సి దృష్టిసారించింది. 49 ప్రాంతాల్లో 119 కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది. ఒక్కో సెగ్మెంటు 14+1 చొప్పున టేబుల్స్ ఏర్పాటు చేయనుంది. 500కుపైగా పోలింగ్ కేంద్రాలున్న రాజేంద్రనగర్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం, కూకట్పల్లి, మేడ్చల్లకు 28+1, 400కుపైగా పోలింగ్ సెంటర్లున్న ఉప్పల్, మల్కాజ్గిరి, పటాన్చెరులకు 20+1 టేబుళ్లను సిద్ధం చేయనుంది.