100 శాతం అధికారంలోకి వస్తాం: మంత్రి కేటీఆర్

byసూర్య | Fri, Dec 01, 2023, 11:41 AM

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఓట్ల లెక్కింపునకు ఈసీ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ సహా జిల్లా కేంద్రాల్లోని పలు విద్యా సంస్థలు, కార్యాలయాల్లో లెక్కింపు కేంద్రాలు సిద్ధం చేస్తున్నారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. కాగా ఈ నెల 3 ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
పార్టీ అభ్యర్థులను ఖరారు చేసినప్పటి నుంచి రెండు నుంచి మూడు నెలల పాటు కష్టపడిన ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి కేటీఆర్. 'ఓటర్లు ఇంకా పోలింగ్ కేంద్రాల్లో ఉన్నారు. సర్వే సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ను నమ్మొద్దు. కార్యకర్తలు, నాయకులు గందరగోళానికి గురికావొద్దు. 100 శాతం అధికారంలోకి వస్తాం.' అని వ్యాఖ్యానించారు.


Latest News
 

ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా ఇంజినీరింగ్ ప్రొఫెసర్లు.. నాలుగేళ్లలో సీన్ రివర్స్, ఎంత కష్టమెుచ్చింది Wed, Oct 30, 2024, 11:01 PM
తెలంగాణలో నేటి వాతావరణం.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్, పెరుగుతున్న చలి తీవ్రత Wed, Oct 30, 2024, 10:55 PM
తెలంగాణలో మయోనైజ్‌ నిషేధం.. రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం Wed, Oct 30, 2024, 10:50 PM
మయోనైజ్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై నిషేధం విధించిన ప్రభుత్వం Wed, Oct 30, 2024, 10:49 PM
తెలంగాణలో వాళ్లందరికీ రేవంత్ సర్కార్ దీపావళి కానుక.. రేపే అకౌంట్లలోకి డబ్బులు Wed, Oct 30, 2024, 10:45 PM