byసూర్య | Fri, Dec 01, 2023, 11:00 AM
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు టీపీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 'పోలింగ్ ముగిసి, ఈవిఎంలు సీల్ చేసి, స్ట్రాంగ్ రూంలకు చేరే వరకు అప్రమత్తంగా ఉండండి. ఎంత రాత్రైనా పోలింగ్ ఎంత శాతం నమోదైందన్న వివరాలను ఎన్నికల సంఘం ఈ రోజే వెల్లడించాలి. గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈసీని డిమాండ్ చేస్తున్నాను." అని రేవంత్ తన ట్విటర్ లో పేర్కొన్నారు.
అయితే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోవచ్చని అంటున్నారు. మిజోరంలో స్థానిక పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉంటుందని అంటున్నారు. దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ పై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ, చత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అనేక ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో బీజేపీకి అధికార పీఠం దక్కే అవకాశం ఉందని అంటున్నారు.