డెడ్‌ స్టోరేజీకి చేరువలో సాగర్‌ జలాలు

byసూర్య | Fri, Dec 01, 2023, 11:11 AM

నాగార్జునసాగర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముళ్లకంచెల నడుమ సాగర్‌ డ్యామ్‌పై పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. నేడు ఇరు రాష్ట్రాలకు చెందిన ఐజీ స్థాయి అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అంచనా వేసే అవకాశముంది. ఇప్పటికే సుమారు 4వేల క్యూసెక్కుల నీటిని ఏపీ విడుదల చేసుకుంది. ప్రస్తుతం సాగర్‌లో 522 అడుగుల నీటిమట్టం ఉండగా.. మరో 12 అడుగులకు చేరితే డెడ్‌ స్టోరేజీకి చేరే అవకాశముంది.
నాగార్జున సాగర్‌ కుడి కాల్వ వద్ద ఇంకా ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. గురువారం అర్థరాత్రి మెయిన్ గేట్ నుండి ఏపీ పోలీసులు చొచ్చుకుని వచ్చి 13గేట్లకు బారికేడ్లు, ఇనుప కంచె ఏర్పాటు చేశారు. అయితే NSP అధికారులు ఏపీ పోలీసులను వెనుదిరగాలని ఆదేశిస్తున్నారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. వెయ్యికి మందికి పైగా పోలీసు బలగాలు మోహరించాయి. కాగా మొన్న రాత్రి నుండి హైడ్రామా కొనసాగుతుంది.


Latest News
 

ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా ఇంజినీరింగ్ ప్రొఫెసర్లు.. నాలుగేళ్లలో సీన్ రివర్స్, ఎంత కష్టమెుచ్చింది Wed, Oct 30, 2024, 11:01 PM
తెలంగాణలో నేటి వాతావరణం.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్, పెరుగుతున్న చలి తీవ్రత Wed, Oct 30, 2024, 10:55 PM
తెలంగాణలో మయోనైజ్‌ నిషేధం.. రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం Wed, Oct 30, 2024, 10:50 PM
మయోనైజ్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై నిషేధం విధించిన ప్రభుత్వం Wed, Oct 30, 2024, 10:49 PM
తెలంగాణలో వాళ్లందరికీ రేవంత్ సర్కార్ దీపావళి కానుక.. రేపే అకౌంట్లలోకి డబ్బులు Wed, Oct 30, 2024, 10:45 PM