byసూర్య | Thu, Nov 30, 2023, 03:59 PM
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నానికి ఊపందుకుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 51.89 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మెదక్ జిల్లాలో అత్యధికంగా 69.33 శాతం, హైదరాబాద్‌లో అత్యల్పంగా 31.17 శాతం పోలింగ్ నమోదైంది. ఆదిలాబాద్, జనగామ, భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నిర్మల్, సిద్దిపేట, సూర్యాపేట, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 60 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.
జిల్లాల వారీగా నమోదైన పోలింగ్ శాతం... అదిలాబాద్ 62.3, భద్రాద్రి 58.3, హనుమకొండ 49, హైద్రాబాద్ 31.1, జగిత్యాల 58.6, జనగాం 62.2, భూపాలపల్లి 64.3, గద్వాల్ 64.4, కామరెడ్డి 59, కరీంనగర్ 56, ఖమ్మం 63.6, ఆసిఫాబాద్ 59.6, మహబూబాబాద్ 65, మహబూబ్ నగర్ 58.8, మంచిర్యాల 59.1, మెదక్ 69.3, మేడ్చల్ 38.2, ములుగు 67.8, నగర , కర్నూల్ 57.5, నల్గొండ 59.9, నారాయణపేట 57.1, నిర్మల్ 60.3, నిజామాబాద్ 56.5, పెద్దపల్లి 59.2, సిరిసిల్ల 56.6, రంగారెడ్డి 42.4, సంగారెడ్డి 56.2, సిద్దిపేట 64.9, సూర్యాపేట 62, వికారాబాద్ 57.6, వనపర్తి 60, వరంగల్ 52.2, యాదాద్రి 64 గా ఉంది.