byసూర్య | Wed, Sep 20, 2023, 01:06 PM
యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కుల, భీమనపల్లి గ్రామాలలో కల్తీ పాలు తయారు చేస్తున్నారన్న సమాచారంతో బుధవారం ఉదయం భువనగిరి ఎస్ఓటి పోలీసులు మెరుపుదాడి చేసారు. వేర్వేరు గ్రామాలలో కల్తీ పాలు తయారు చేస్తున్న కుంభం రఘు, కప్పల రవి అనే వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి నుండి 450 లీటర్ల కల్తీ పాలు, 4 డోలో స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ప్యాకెట్లు, 300 లీ. హైడ్రోజన్ పెరాక్సైడ్ ను స్వాధీనం చేసుకున్నారు