ఆరు హామీలని వాడవాడలా ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతలు

byసూర్య | Wed, Sep 20, 2023, 01:04 PM

రాష్ట్రంలోని అత్యధిక జనాభాని ఆకర్షించే ఆరు హామీలను కాంగ్రెస్ విజయభేరి సభలో సోనియా ప్రకటించిన సంగతి తెలిసిందే. అభయ హస్తం పేరుతో ఆ ఆరు గ్యారెంటీలను కార్డుపై సవివరంగా ముద్రించిన టీపీసీసీ.. వాటిని ఇంటింటికీ పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. సుమారు వంద మంది జాతీయ నేతలు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో ప్రారంభించినట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. స్థానిక పార్టీ నేతలు ఇంటింటికీ వెళ్లి పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలనూ అమలు చేస్తామని చెప్పడంతో పాటు కార్డు అందినట్లుగా రసీదులూ తీసుకోనున్నారని వెల్లడించాయి. రైతులతో పాటు కౌలు రైతులకూ ఎకరాకు రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం, వ్యవసాయ కార్మికునికి రూ.12 వేలు గ్యారెంటీ అనేది రైతాంగం మొత్తాన్ని ఆకర్షించేలా ఉందని అంటున్నారు. పేద మహిళలకు రూ.2500, రూ.500కే సిలెండర్‌ గ్యారెంటీ అనేవి సగటు మహిళ అవసరాలన్నింటినీ తీర్చేలా ఉన్నాయంటూ మహిళల నుంచి పార్టీ నేతలకు కితాబులూ వచ్చాయి. 


Latest News
 

పదవి విరమణ పొందిన ఉద్యోగులకు సన్మానం Wed, Oct 30, 2024, 08:44 PM
హైదరాబాద్ నగర ట్రాఫిక్ విభాగంలోకి కొత్తగా హైడ్రా వాలంటీర్లు Wed, Oct 30, 2024, 08:42 PM
గొల్లపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ Wed, Oct 30, 2024, 08:41 PM
మహిళల భద్రతే మా ప్రధాన బాధ్యత Wed, Oct 30, 2024, 08:40 PM
4 లైన్ హైవేకు గ్రీన్ సిగ్నల్.. మారనున్న ఆ జిల్లా కేంద్రం రూపురేఖలు Wed, Oct 30, 2024, 08:21 PM