byసూర్య | Wed, Sep 20, 2023, 01:03 PM
బువ్వ పెట్టి.. పదవి గుంజుకోవాలని కాంగ్రెస్ నేత బత్తుల లక్ష్మారెడ్డి అనుకుంటున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. మన ఇంట్లో మనిషి పోతే తిండి కోసం పరాయి వాళ్లకు ఫోన్లు చేయడం ఏం ఖర్మ అని విమర్శించారు. ఇక్కడ పెత్తనం చేయడానికి బత్తుల లక్ష్మారెడ్డి ఎవరంటూ అసహనం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో ఆంధ్రా వాళ్లకు ఏం పని అని ప్రశ్నించారు. గత చరిత్రను పునరావృతం చెయ్యడానికి.. దోచుకునేందుకే బత్తుల లక్ష్మారెడ్డి, షర్మిల, కేవీపీలు తెలంగాణలో అడుగు పెడుతున్నారన్నారు.