byసూర్య | Wed, Sep 20, 2023, 01:02 PM
పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన ఎంఐఎం మహిళా ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మండిపడ్డారు. ఈ బిల్లు విషయంలో కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సలు ద్వంద్వ విధానాలు మానుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లోనే 33 శాతం రిజర్వేషన్‌కు అనుగుణగా టికెట్లు ఇచ్చి తమ చిత్తశుద్ధి చాటుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.