byసూర్య | Wed, Sep 20, 2023, 01:02 PM
విజయభేరి సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీ పథకాలు సంతకం లేని పోస్ట్ డేటెడ్ చెక్కు లాంటివని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీ పథకాలంటే ఆరు నెలలకో ముఖ్యమంత్రిని మార్చడం, ఆరు నెలలకోసారి కర్ఫ్యూ విధించడం, వ్యవసాయానికి 6 గంటలే కరెంటు ఇవ్వడం, పరిశ్రమలకు పవర్‌హాలిడే ప్రకటించడమని ఎద్దేవా చేశారు. ఎలాగూ అధికారంలోకి రాలేమనే కాంగ్రెస్ నాయకులు జూటా మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రభుత్వం చతికిలపడిందన్నారు. అక్కడ రూ.600 పింఛన్ ఇవ్వలేని పార్టీ.. తెలంగాణలో రూ.4వేలు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. ఉచిత కరెంట్ అని హామీ ఇచ్చి 6 గంటలు కూడా సరఫరా చేయడం లేదని ఆరోపించారు.