ప్రియురాలు కోసం వెళ్లి బంధువుల చేతిలో దాడికి పాల్పడిన యువకుడు

byసూర్య | Wed, Sep 20, 2023, 01:01 PM

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో మంగళవారం సాయంత్రం ఘర్షణ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే...... యాదాద్రి జిల్లా ఆలేరుకు చెందిన గుండు సాయికిరణ్‌ అనే యువకుడు సిద్దిపేట పట్టణానికి చెందిన ఒక అమ్మాయిని కలవడానికి రాగా అతడిపై అమ్మాయి బంధువులు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ సాయికిరణ్‌ను స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారమందుకున్న వన్‌ టౌన్‌ సీఐ కృష్ణారెడ్డి తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తును చేపట్టారు. ఈ దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని, దాడి చేసింది అమ్మాయి మేన బావ అని స్థానికంగా చర్చించుకుంటున్నారు. సాయికిరణ్‌ మెడపై కత్తితో దాడి చేయడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్పారు.


Latest News
 

ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా ఇంజినీరింగ్ ప్రొఫెసర్లు.. నాలుగేళ్లలో సీన్ రివర్స్, ఎంత కష్టమెుచ్చింది Wed, Oct 30, 2024, 11:01 PM
తెలంగాణలో నేటి వాతావరణం.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్, పెరుగుతున్న చలి తీవ్రత Wed, Oct 30, 2024, 10:55 PM
తెలంగాణలో మయోనైజ్‌ నిషేధం.. రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం Wed, Oct 30, 2024, 10:50 PM
మయోనైజ్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై నిషేధం విధించిన ప్రభుత్వం Wed, Oct 30, 2024, 10:49 PM
తెలంగాణలో వాళ్లందరికీ రేవంత్ సర్కార్ దీపావళి కానుక.. రేపే అకౌంట్లలోకి డబ్బులు Wed, Oct 30, 2024, 10:45 PM