byసూర్య | Wed, Sep 20, 2023, 01:00 PM
కాంగ్రెస్ విజయభేరి సభ వేదికగా ప్రకటించిన గ్యారంటీలతో బీఆర్‌ఎస్ నేతలు కలవరపడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సోనియా గాంధీ తెలంగాణకు రావడంతో బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీల అసలు రంగు బయటపడిందని చెప్పారు. తమకు అధికారం ఇస్తే ఏం చేస్తామో చెబుతూ ప్రజల్లోకి వెళ్తామని స్పష్టం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ట్రాక్‌రికార్డు చూసి నిర్ణయం తీసుకోవాలని ప్రజలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి మధ్య తేడా గమనించాలని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, అర్హులకు పోడు భూముల పట్టాలు, ఆరోగ్య పథకాలు అమలు చేసి చూపించామన్నారు. దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు అంటూ కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు.