byసూర్య | Wed, Sep 20, 2023, 01:00 PM
ఈ నెల 15 నుంచి ఆర్టీసీలో ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారినట్టు ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ సర్కారు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆర్టీసీలో అమలులో ఉన్న నియమ నిబంధనలు యథాతథంగా అమలవుతాయని పేర్కొంది. ఆర్టీసీలో వివిధ విభాగాల్లో 43,045 మంది పనిచేస్తున్నారు. కాగా, ఈ విలీనం ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ విషయమై ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు నేతృత్వంలో కొంతమంది అధికారులు అధ్యయనం చేస్తున్నారు. కేడర్‌ను నిర్ధారించిన తర్వాత పూర్తి స్థాయి జీవో విడుదల చేయాలని భావిస్తోంది. దీనికి మరో నెల రోజులు పడుతుందని ఉద్యోగ సంఘాలు, ఆర్టీసీ సంఘాల నేతలు అంటున్నారు.